తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ విడుదల తేదీ, సమయం
TSBIE ఈరోజు, ఫిబ్రవరి 19, 2024న ఇంటర్మీడియట్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్‌లను విడుదల చేస్తుంది. త్వరలోనే హాల్ టికెట్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి?
విద్యార్థులు వారి ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ లో పేర్కొనే వివరాలు
1: విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ 2: విద్యార్థి పేరు 3: తండ్రి పేరు 4: తల్లి పేరు 5: పరీక్ష కేంద్రం పేరు మరియు చిరునామా 6: పరీక్ష మీడియం 7: జిల్లా పేరు
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు
TS ఇంటర్ 1వ సంవత్సరం పరీక్షలు 2024 ఫిబ్రవరి 28 నుండి మార్చి 18, 2024 వరకు, 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుండి మార్చి 19, 2024 వరకు నిర్వహించబడతాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష గురించి క్లుప్తంగా
TS ఇంటర్ పరీక్షలను TSBIE నిర్వహిస్తుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని 1,521 పరీక్షా కేంద్రాల్లో జరిగే టీఎస్ ఇంటర్ పరీక్షకు 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు